అద్దెకు ఫోన్లు…

హైదరాబాద్: యాపిల్,శామ్‌సంగ్‌,గూగుల్‌ పిక్సల్‌, ఇతర ఖరీదైన సంస్థల నుంచి ఫోన్  మార్కెట్ లోకి వచ్చిందంటే దాని ఫీచర్లు చూసి మురిసిపోవడం తప్ప దాన్ని కొనుగోలు చేయడం చాలా మందికి సాధ్య పడదు. అలాంటి వారి కోసం ఆన్‌లైన్‌ రెంటల్  వెబ్‌సైట్‌ రెంటోమోజో ఖరీదైన ఫోన్లను అద్దెకు ఇస్తోంది. ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ 8, గూగుల్‌ పిక్సల్‌ 2, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌9, గెలాక్సీ నోట్‌ 8 వంటి ఫోన్లను ఆరు నెలలు, సంవత్సరం, రెండేళ్ల కాలవ్యవధిపై అద్దెకు ఇస్తోంది. […]

హైదరాబాద్: యాపిల్,శామ్‌సంగ్‌,గూగుల్‌ పిక్సల్‌, ఇతర ఖరీదైన సంస్థల నుంచి ఫోన్  మార్కెట్ లోకి వచ్చిందంటే దాని ఫీచర్లు చూసి మురిసిపోవడం తప్ప దాన్ని కొనుగోలు చేయడం చాలా మందికి సాధ్య పడదు. అలాంటి వారి కోసం ఆన్‌లైన్‌ రెంటల్  వెబ్‌సైట్‌ రెంటోమోజో ఖరీదైన ఫోన్లను అద్దెకు ఇస్తోంది. ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ 8, గూగుల్‌ పిక్సల్‌ 2, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌9, గెలాక్సీ నోట్‌ 8 వంటి ఫోన్లను ఆరు నెలలు, సంవత్సరం, రెండేళ్ల కాలవ్యవధిపై అద్దెకు ఇస్తోంది. ఇందుకు నెలకు రూ.2,099 నుంచి 9,299 వరకు అద్దెగా వసూలు చేస్తోంది. రెండేళ్ల అద్దె పూర్తయిన తర్వాత ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్‌ ఎక్స్‌ను 24 నెలల అద్దెకు తీసుకుంటే నెలకు రూ.4,299 చెల్లించాల్సి ఉంటుందని రెంటో‌మోజో పేర్కొంది. ఒకవేళ ఆరు నెలలకు తీసుకుంటే నెలకు రూ.9,299 చెల్లించాలి. ఫోన్‌ కోసం ముందుగా రూ.9998 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని తర్వాత రిఫండ్‌ చేస్తారు

Related Stories: