అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య…

Missing Man murdered
గుమ్మడిదల: గత నెల 17 న అదృశ్యమైన వ్యక్తి హత్య కు గురైన సంఘటన గుమ్మడిదల మండలంలోచోటు చేసుకుంది. దీనిపై వార్త మన తెలంగాణ పత్రిలో ఈ నెల 4 న రావడం జరిగింది. మృతిని అన్నలు ఫిర్యాదు చేసిన 3 రోజుల్లోనే కేసును పోలీసులు చేధించారు. ఇందులో మృతుని భార్యే ముద్దాయి కావడం కొస మెరుపు. సిఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుని భార్య మహిమాళకు హత్య చేసిన ప్రధాన ముద్దాయి మద్ది మల్లారెడ్డికి అక్రమ సంబంధం ఉంది. మల్లారెడ్డి న్యూలాండ్ కంపెనీలో కాంట్రాక్టర్. మృతుడు వెంకటేశ్ అదే కంపెనీలో పని చేస్తున్నాడు. అదే గ్రామంలో నివసించడం మృతుని ఇంటికి తరుచుగా వెళ్ళి రావడం వలన మృతుని భార్యకు మల్లారెడ్డికి అక్రమ సంబంధం ఏర్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. వీరి అక్రమ సంబంధం తెలిసిన మృతుడు వెంకేటేశం తన భార్యను హింసించడం మొదలు పెట్టాడని పోలీసులు తెలిపారు. దీంతో ఈ విషయాన్ని మహిమాళ తన ప్రియుడు మల్లారెడ్డికి చెప్పి ఎలాగైనా భర్త అడ్డును తొలగించుకోవాలని పథకం ప్రకారం హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. దీనికి మల్లారెడ్డి వద్ద పనిచేసే కార్మికుడు గడ్డం మహేష్ సహకరించినట్లుగా పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకేటేశం హత్య గురైన విధానంః
తమ పథకం ప్రకారం గత నెల 18 న సాయంత్రం 5ః30 ప్రాంతంలో తన స్వంత వాహనం(టి.ఎస్ 15 ఇ.ఎల్ 1269)లో మృతుని ఇంటికి వెళ్ళి మృతున్ని తనకు గ్రామంలో గల ఆఫీసుకు తీసుకు వెళ్లడం జరిగింది. అనుకున్న ప్రకారం అక్కడే ఉన్న రెండవ ముద్దాయి మహేష్ వీరికి మద్యం తీసుకు రావడం జరిగిందని తెలిపారు. ఇద్దరు కలసి వెంకటేశ్కు మద్యం బాగా తాగించి స్పృహ కోల్పోయేలా చేసారని తెలిపారు. తరువాత మల్లారెడ్డి మరియు మహష్ ఇద్దరు కలసి కారులో వెంకటేశ్‌ని నర్సాపూర్ మీదుగా నారాయణ్ ఖేడ్ మండలంలోని నిజామ్‌పేట్ సరిహద్దుల్లోకి తీసుకునివెళ్ళారని తెలిపారు. దారిలో 4 లీటర్ల పెట్రోలు కూడా ఖరీదు చేసేకుని వెళ్ళడం జరిగిందని అన్నారు. నిజామ్‌పేట్‌కు వెళ్లిన తరువాత వెంకటేశ్‌ని బండ రాయితో మోది చంపివేసారని పోలీసులు తెలిపారు. ఆ తరువాత వారు తెచ్చుకున్న పెట్రోలును పోసి వెంకటేశ్‌ని గుర్తు పట్టని విధంగా కాల్చివేసారని తెలిపారు.

Comments

comments