అదుపు తప్పి లారీ బోల్తా…

చెేవెళ్ల రూరల్ :అతివేగం అజాగ్రత్తగా నడపడంతో లారీ బోల్తా పడిన సంఘటన చేవెళ్ల మండలంలోని షాబాద్ చౌరస్తాలో ఆదివారం ఉదయం 11గంటలకు చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాద్‌నగర్‌లోని బాలానగర్ నుంచి అట్టల లోడుతో చేవెళ్ల వైపు బయలు దేరింది. లారీ డ్రైవర్ అతి వేగంగా నడపడంతో షాబాద్‌లో ఓ వాహనాన్ని ఢీకొట్టి చేవెళ్ల వైపు అతి వేగంగా రావడంతో షాబాద్ చౌరస్తాలోని మూల మలపు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. రోడ్డుకు […]

చెేవెళ్ల రూరల్ :అతివేగం అజాగ్రత్తగా నడపడంతో లారీ బోల్తా పడిన సంఘటన చేవెళ్ల మండలంలోని షాబాద్ చౌరస్తాలో ఆదివారం ఉదయం 11గంటలకు చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాద్‌నగర్‌లోని బాలానగర్ నుంచి అట్టల లోడుతో చేవెళ్ల వైపు బయలు దేరింది. లారీ డ్రైవర్ అతి వేగంగా నడపడంతో షాబాద్‌లో ఓ వాహనాన్ని ఢీకొట్టి చేవెళ్ల వైపు అతి వేగంగా రావడంతో షాబాద్ చౌరస్తాలోని మూల మలపు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. రోడ్డుకు అడ్డంగా లారీ పడటంతో వాహనాలు రాకపోకలు సాగించేందుకు అంతరాయం ఏర్పడింది. లారీ బోల్తా పడిన సమయంలో అటుగా వాహనాలు రాకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఎస్ఐ శ్రీధర్‌రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని రెండు క్రేన్ల సహాయంతో లారీని రోడ్డు మధ్యలో నుంచి పక్కకు లాగారు.

Related Stories: