అదుపు తప్పి బస్సు బోల్తా…

Road accident at BB Nagar in Yadadri Bhongiri district

బిబినగర్ : అదుపు తప్పి సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడిన సంఘటన మండల పరిధిలోని కొండమడుగు మెట్టు కేపాల్ సమీపంలో శనివారం చోటు చెేసుకుంది. పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు యాదాద్రి నుండి 25 మంది ప్రయాణికులతో విజయవాడ బయలుదేరింది. బస్సు కొండమడుగు మెట్టు కేపాల్ సమీపంలో జాతీయ రహదారి 163 పై కారును ఒవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదన్ని గమనించిన స్థానికులు వెంటనే వెనుక, ముందు బస్సు అద్దాలు పగులగోట్టి ప్రయణీకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాగ ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఏలాంటి ప్రాణ నష్టం జరగలేదు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments