అదుపు తప్పిన బైక్: మామ, అల్లుడు మృతి

Two Persons Dies In Road Accident
అర్వపల్లి: బైక్ అదుపు తప్పి ఇద్దరు మృతి చెందిగా, మరో  ఇద్దరు తీవ్రంగా గాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన మామా,అల్లుడు మామ వోర్సురాములు (45), వేముల కనకయ్య(25) ఇతని భార్య శైలజ, వీరి కూతురు లావక్యలు బైక్ పై నల్గొండకు వెళ్తుండగా అర్వపల్లి మండల పరిధిలోని కుంచమర్తి గ్రామ శివారులో మంగళవారం బైకు అదుపు తప్పి పడిపోవడంతో మామ, అల్లుడు రాములు, కనకయ్యలకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసు సిబ్బంది ప్రైవేటు వాహనంలో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మామ,అల్లుడు మార్గ మధ్యంలో మృతి చెందారు. వేముల కనకయ్య భార్య శైలజకు, కూతురుకు గాయాలు కావడంతో వారు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇట్టి విషయంపై ఎస్‌ఐ పి.లోకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మామ,అల్లుడు చని పోవడంతో ఏరియా ఆసుపత్రిలో విషాద చాయలు అలుముకున్నాయి.

Comments

comments