అదుపుతప్పి ఆటో బోల్తా…ఒకరి పరిస్థితి విషమం

కొడంగల్‌ః ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దనందిగామా గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. బాధితులు,ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి… గుండ్లకుంట నుంచి దౌల్తాబాద్ మండలం నందారంకు కులీలతో వెళ్తున్న ఆటో పెద్దనందిగామా వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో లక్ష్మి,మొగులమ్మ,రామమ్మ,ఆశమ్మ,మహేష్‌లు గాయపడ్డారు. క్షతగాత్రులను కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సలు […]

కొడంగల్‌ః ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దనందిగామా గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. బాధితులు,ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి… గుండ్లకుంట నుంచి దౌల్తాబాద్ మండలం నందారంకు కులీలతో వెళ్తున్న ఆటో పెద్దనందిగామా వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో లక్ష్మి,మొగులమ్మ,రామమ్మ,ఆశమ్మ,మహేష్‌లు గాయపడ్డారు. క్షతగాత్రులను కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు. కాగా లక్ష్మి తలకు తీవ్ర గాయాలు కావడంతో హైద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Related Stories: