అత్యాచార నిందితులకు 20ఏళ్ల జైలు!

20 Year Sentenced to Accused in Rape Case in Karimnagar District

కరీంనగర్: ఓ యువతిపై అత్యాచారం కేసులో కరీంనగర్ జిల్లా కోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరికి ఇరవై ఏళ్ల చొప్పున జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరి రూ. 5వేల జరిమానా విధించింది. 2013 ఏప్రిల్ 18న బెల్లంపల్లికి చెందిన యువతి రైల్వే స్టేషన్‌లో ఉండగా నమ్మించి తీసుకెళ్లి నిందితులు సురరాజ్, సమీర్ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసులో ఐదో అదనపు సెషన్స్ న్యాయవాది నాగరాజు ముద్దాయిలకు 20 ఏళ్ల చొప్పున శిక్షను విధించారు.

Comments

comments