అడివి సాయికిరణ్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ చాముండి చిత్రాలు

మిస్టర్ పెళ్లాం, శ్రీకారం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీ చాముండి నిర్మాణ సంస్థ  చాలా  కాలం విరామం తర్వాత మళ్లీ సినిమాలను నిర్మిస్తోంది. సంస్థ అధినేత గవర పార్థసారధి ప్రస్తుతం రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. ఒకటి అడివి సాయికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా  మరొకటి సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి సాయికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ త్వరలో […]

మిస్టర్ పెళ్లాం, శ్రీకారం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీ చాముండి నిర్మాణ సంస్థ  చాలా  కాలం విరామం తర్వాత మళ్లీ సినిమాలను నిర్మిస్తోంది. సంస్థ అధినేత గవర పార్థసారధి ప్రస్తుతం రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. ఒకటి అడివి సాయికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా  మరొకటి సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి సాయికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ త్వరలో ఆరంభం కానుంది. మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఇండియన్ ఫస్ట్ సబ్‌మెరైన్ మూవీ ‘ఘాజీ’ ద్వారా జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్న సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు నిర్మాత గవర పార్థసారధి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఓ ప్రముఖ యువ కథానాయకుడు ఈ చిత్రంలో నటించనున్నారు.

Comments

comments

Related Stories: