అటల్ జీ ఆరోగ్యం మరింత విషమం

Atal Bihari Vajpayee stable, responding to treatment: New bulletin

ఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్యం విషమంగా ఉందని ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బుధవారం రాత్రి మాదిరిగానే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయనకు వెంటిలెటర్ పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు.  మూత్రపిండాల సమస్య ఇతర శారీరక క్లిష్టతలతో వాజ్‌పేయి ఎయిమ్స్‌లో చేరారు. బుధవారం సాయంత్రం ఎయిమ్స్‌కు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి అటల్ జీ ఆరోగ్య పరిస్థితి  వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర జవుళి మంత్రి స్మృతి ఇరానీ, బిజెపి అధ్యక్షులు అమిత్ షా ఇతర నేతలు కూడా ఈ ప్రతిష్టాత్మక వైద్య సంస్థకు వచ్చి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. గురువారం ఉద‌యం భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయిని ప‌రామ‌ర్శించారు.

Comments

comments