అగ్నిప్రమాద ఘటనపై కడియం, జానా దిగ్ర్భాంతి

Jana-Reddy-and-Kadiyam-Srih

కోటిలింగాల: వరంగల్ జిల్లాలో అగ్నిప్రమాద ఘటనపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సిఎల్‌పి నేత జానా రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు కడియం ఆదేశాలు జారీ చేశారు. అగ్నిప్రమాదం విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. బాధితులకు తగిన వైద్య సాయం అందించాలని కడియం సూచించారు. కడియం శ్రీహరి ఘటనా స్థలికి వెళ్లనున్నారు.  వరంగల్ జిల్లా కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్క్స్ గోదాములో  బుధవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది సజీవదహనమైన విషయం తెలిసిందే.

Comments

comments