అగ్నిప్రమాదంలో 18మంది మృతి

బీజింగ్ (చైనా): హార్బిన్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18మంది చనిపోయారు. హార్బిన్‌లోని సన్ ఐలాండ్ రిసార్ట్ ప్రాంతంలో ఉన్న బెయ్‌లాంగ్ హాట్ స్ప్రింగ్ హోటల్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొదట నాలుగో అంతస్తులో మంటలు చెలరేగి కాసేపటికే భవనం మొత్తం వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే మంటల్లో చిక్కుకుని 18మంది చనిపోయారు. 16 మందిని అగ్నిమాపక సిబ్బంది […]

బీజింగ్ (చైనా): హార్బిన్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18మంది చనిపోయారు. హార్బిన్‌లోని సన్ ఐలాండ్ రిసార్ట్ ప్రాంతంలో ఉన్న బెయ్‌లాంగ్ హాట్ స్ప్రింగ్ హోటల్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొదట నాలుగో అంతస్తులో మంటలు చెలరేగి కాసేపటికే భవనం మొత్తం వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే మంటల్లో చిక్కుకుని 18మంది చనిపోయారు. 16 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు. షార్ట్‌సర్కూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

18 People died in Fire Accident at China

Comments

comments

Related Stories: