అగ్నికి ఆహుతవుతున్న ఓరుగల్లు జనం…

wrl

మన తెలంగాణ/ వరంగల్ క్రైం : నగరంలో పెరుగుతున్న మృత్యు శకటాలు, డెంజర్ బల్స్‌ని మోగిస్తున్నాయి. అగ్ని పర్వతాలు బద్దలయ్యేందుకు ఎదురు చూస్తున్నాయి. నిన్న రోహిణి హస్పిటల్… నేడు భద్రకాళి ఫైర్ వర్క్ ప్యాక్టరీ.. రేపు మరోకటి.. ఘటన ఎక్కడైన ప్రమాధం ఒక్కటే.. అణువు అణువు అనుమానాలే గంటల్లో కోట్ల రూపాయల ఆస్తి నష్టంతో పాటు అమాయకులు ప్రాణాలు కోల్పొతున్నారు. వరంగల్ నగరానికి అగ్ని ప్రమాధం పొంచివుంది. నగర వాసుల గుండెల్లో ఫైర్ పరుగులు పెట్టేందుకు సిద్దంగా ఉంది. ఎవరి నిర్లక్షానికి ఎవరు బాధ్యులు, తప్పు చేసిందెవరు శిక్షణ అనుభవించేది ఎవరు, ప్రజాప్రతినిధుల సమాధానం ఎంటి, ప్రభుత్వ అధికారుల జవాబు ఎంటి, స్థానికుల పరిస్థితి ఎంటి, కళ్లు మూసి తెరిచేలోగా అంతా జరిగిపోయే వరంగల్ నగరంలో అగ్నిప్రమాధాలకు ప్రభుత్వ అధికారులే ప్రత్యేక సాక్షులుగా నిలుస్తున్నారు. నిత్యం రద్దిగా ఉండే ప్రధాన కూడళ్లలో అక్రమ నిల్వలు, కార్యకలాపాలు రాజ్యమేలుతున్నాయి. గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో గత కొన్ని నెలల క్రితంలో జరిగిన రోహిణి ఆసుపత్రి అగ్ని ప్రమాధం మరవక ముందే వరంగల్ రూరల్ జిల్లా కోటి లింగాల దేవస్థానం సమీపంలో జరిగిన భద్రకాళి ఫైర్ వర్క్ పేలుడు అగ్నిప్రమాధం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ అగ్నిప్రమాధంలో పది మంది కూలీలు సజీవ దహనమైన సంఘటనపై సీఎం కేసిఆర్ చలించారు. తీవ్రంగా గాయపడిన వారికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేసియా అందజేసేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం అయితే ఘటనలు జరిగినప్పుడల్లా హడావుడి చేసి కేసులు పెట్టి ప్రభుత్వం నుండి నష్ట పరిహారాలు కట్టించడం జిల్లా యంత్రాంగానికి అలవాటుగా మారుతుంది. అయితే ఇలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా చరమగీతం పాడాలని వరంగల్ నగర ప్రజలు కోరుతున్నారు.
నగర నడిబొడ్డున గ్యాస్ కంపెనీలు, స్టోరేజీలు
వరంగల్ నగర నడిబొడ్డున గ్యాస్ కంపెనీలు పుట్టల, పుట్టలుగా నెలకొని ఉన్నాయి. గ్యాస్ కంపెనీలతో పాటు గోధాంలు, గ్యాస్ ఫిల్టింగ్ సెంటర్లు సైతం ప్రధాన రహదారులకు ఆనుకొని ఉండడం ప్రమాధాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అయితే వీటితో పాటు జనం నివాసాల మద్యలో కూడా పెట్రోల్ బంక్‌లు కూడా పెద్ద మొత్తంలో దర్శనమిస్తున్నాయి. ఇలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నాన్స్ ప్రకారం ఇండష్ట్రియల్ సంబంధించిన ఏ పరిశ్రమలు కూడా గ్రేటర్ పరిధి ఆవుట్ స్కట్స్‌కు దూరంకు తరలించుకోవల్సిందే. అయితే అలా కాకుండా గ్రేటర్ నగర ఒడ్డు నుండి శివారు ప్రాంతం వరకు గ్యాస్ కంపెనీల స్టోరేజ్, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు, ఆయిల్ మిల్లులు, కిరోసిన్ మిల్లులు, పెట్రోల్ బంక్‌ల వరకు అన్ని జనాల మద్యలోనే డేంజర్ జోన్‌గా దర్శనమిస్తున్నాయి. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు మామూల్ల మత్తులో తూగుతు నిర్లక్షదోరణిని అవలంభిస్తున్నారు. ఇక నగరంలోని హన్మకొండ శ్రీనివాసకాలనీ, వరంగల్‌లోని ఎల్‌బి నగర్ గ్యాస్ గోధాంలు, వరంగల్ కరీమాబాద్ ఫోర్ట్ రోడ్‌లో, హన్మకొండ హంటర్ రోడ్డులో గ్యాస్ గోధాంలు జనాల మధ్య ఉండడంతో స్థానికులు, నగర ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. బుధవారం జరిగిన అగ్ని ప్రమాధానికి ఓరుగల్లు నగరం ఎప్పుడు ఏ ప్రమాధం జరుగుతుందోనని వనికిపోతున్నారు.
అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పది : సిపి రవీందర్
బుధవారం వరంగల్ నగరంలోని కోటి లింగాల దేవాలయం పరిసర ప్రాంతంలో ఉన్న భద్రకాళి ఫైర్ వర్క్ గోధాంలో జరిగిన ప్రమాధంలో మృతుల సంఖ్య 10 మందిగా దర్యాప్తులో తెలినట్టుగా సిపి తెలిపారు. నిన్నటి రోజున ఎనిమిది మంది మృతదేహాలను గుర్చించగా పోస్ట్‌మార్టం అనంతరం వారి కుటుంబసభ్యులకు అప్పగించడం జరిగింది. ఈ ప్రమాధంలో మరో ఇద్దరు వ్యక్తులైన వంగరి రాకేష్, వడ్నాల మల్లిఖార్జున్‌లు మరణించినట్లుగా పోలీసులు విచారణలో తెలడంతో, నిన్నటి రోజున పోలీసు అధికారులు ప్రమాధం జరిగిన సంఘటన స్థలంతో పాటతతు చుట్టు పక్కల నుండి చెల్ల చెదురుగా పడివున్న మృతదేహం అవయవాల అవశేషాలను సేకరించడంతో పాటు మృతులను ఖచ్చితంగా నిర్థారించేంపదకు పోలీసు అధికారులు నిపుణుల ద్వారా మృతదేహాల అవయవాల నుండి నమూనాలను సేకరించి, వాటిని డిఎన్‌ఎ పరీక్ష నిమిత్తం హైద్రబాద్‌కు తరలించడం జరిగింది.
గోధాములపై తనిఖీలు చేసిన పోలీసులు.. రెండు బాంబుల కేంద్రాలు సీజ్‌చేసిన ఆర్‌డివో
వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ప్రజల జనవాసాల మద్యలో బాణసంచా గోధాములు ఏర్పాటు చేయడంతో పాటు, వ్యాపారం నిర్వహిస్తున్న బాణసంచా గోధాములు, దుకాణాలను గురువారం పోలీస్ అధికారులు స్థానిక అగ్నిమాపక విభాగం అధికారులతో కల్సి విస్తృత తనిఖీలు నిర్వహించడంతో పాటు, వ్యాపారం నిర్వహణ కోసం అవసరమైన అనుమతి పత్రాలను పోలీసులు పరిశీలించడంతో పాటు,ప్రజలు నివసించే ప్రాంతాలలోని బాణసంచా గోదాములు, దుకాణాలను తక్షణమే శివారు ప్రాంతాలను తరలించే విధంగా చర్యలు చేపడుతున్నట్లుగా పోలీస్ కమీషనర్ తెలిపారు.

Comments

comments