అఖిల్ సినిమాలో కీలక పాత్ర

Kajal-Agarwal

అక్కినేని అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో మరో హీరోయిన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోందట. కానీ ఆ విషయాన్ని సినిమా యూనిట్ రహస్యంగా ఉంచిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్. మరి కాజల్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తోందనే విషయం ఇంకా తెలియరాలేదు. మరి దర్శకుడు వెంకీ అట్లూరి కాజల్ కోసం ఎలాంటి పాత్రను డిజైన్ చేశాడో చూడాలి. ఇంకా అధికారికంగా టైటిల్‌ను ప్రకటించని ఈ సినిమాకు ‘మిస్టర్ మజ్ను’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్. జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.