అక్షరంపై సర్కారు నిర్లక్ష్యం

 Children in the school

మన తెలంగాణ/కౌటాల:  ప్రతి మనిషిలోని అత్యున్నత సామర్థాన్ని వెలికి తీసేది విద్య. అలాంటి విద్య కోసం ఎన్ని ప్రభుత్వా లు మారినా సత్ఫలితాలు సాధించలేక పోతున్నాయి. కొత్తగా ఏ ర్పాటైన ప్రతి ప్రభుత్వం విద్యపై ఎన్నో రకాల ప్రయోజనం  ఉం డే విధంగా పథకాలను రూపొందించినా అవి పూర్తిస్థాయిలో వి జయవంతం అవుతున్నట్లు ఎక్కడా కన్పించడం లేదు. కుమ్రం భీం జిల్లాలోని కౌటాల మండలం అక్షరాస్యతలో విద్యార్థులు చా లా వెనుకబడి ఉన్న విషయం విదితమే. ఇప్పటికే గ్రామాల్లో బడిఈడు పిల్లలు వ్యవసాయ పనులకు వెళ్తుండడం శోచనీయం. పాలకులు మారినా వారి తలరాతలు మారలే దు. కౌటాల ఉ మ్మడి మండలంలో మొత్తం 6,077 మంది విద్యార్థులు ఉన్నా రు. 75 మంది ఉపాధ్యాయులు పాఠశాలల్లో బోధిస్తున్నారు. కొన్ని బడులలో తగినంత ఉపాధ్యాయులు లేక విద్యార్థులు రా వడం  లేదు. వీటిలో కొన్ని మూతపడే దశకు చేరుకున్నాయి. మ రి కొన్ని పాఠశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందు లు పడుతున్నారు. పాఠశాలల్లో కనీసం నీటి వసతి, మురుగుదొ డ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు.

పనుల బాటపడుతున్న బడిఈడు పిల్లలు
మండల కేంద్రంలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రెండు నెలలు గడిచినప్పటికీ ఉన్నత విద్యాధికారులు స్పందించడం లేదని తల్లిదండ్రులు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం వస్తే వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. ప్రస్తుతం కౌటాల మండలంలోని విద్యపై ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకుల వాగ్దానాలు ఇవ్వడం వరకే పరిమితం అవుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలో గురుకుల, కేజీబివి పాఠశాల హాస్టల్ సౌకర్యం కల్పిస్తే విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దీంతో పా టు విద్యాబోధనపై ప్రత్యేక కమిటీని వేసి ఎప్పటికప్పుడే పర్యవేక్షించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Comments

comments