అక్రమ సంబంధం: భర్తపై భార్య దాడి

Wife Attacked Her Husband In Rajanna Sircilla Dist
సిరిసిల్ల: భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భర్తపై భార్య దాడి చేసిన సంఘటన బుధవారం సిరిసిల్లలో చోటు చేసుకుంది. భార్యా భర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే. భర్త బుధ్ధి వక్రమార్గం పట్టింది. 16,13 సంవత్సరాల వయస్సున్న పిల్లలు ఉన్నా ఆ ఉపాధ్యాయుడు మరో స్త్రీతో వేరు కాపురం పెట్టాడు. వేములవాడకు చెందిన హన్మాండ్లకాడి శ్రీనివాస్, పద్మ దంపతులు. శ్రీనివాస్ వేములవాడ మండలం చెక్కపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుని(ఎస్‌ఏ)గా పనిచేస్తున్నాడు. పద్మ అదే మండలంలోని ఎదురుగట్లలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలి(ఎస్‌జిటి )గా పనిచేస్తోంది. వీరికి 16 సంవత్సరాల బాబు, 13 సంవత్సరాల పాప ఉన్నారు. అయితే కొంత కాలంగా వేములవాడకు చెందిన సంధ్య అనే మహిళతో శ్రీనివాస్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సంధ్యను సిరిసిల్లలోని అనంతనగర్‌లో ఇల్లు కిరాయికి తీసుకుని కాపురం చేస్తున్నాడు. ప్రస్తుతం సంధ్య మూడు నెలల గర్భీణి. గత పది రోజులుగా శ్రీనివాస్ వేములవాడలోని పద్మ ఇంటికి పోకుండా సిరిసిల్లలోని అనంతనగర్‌లోనే ఉంటున్నాడు. దాంతో బుధవారం సిరిసిల్లకు బంధువులతో కలిసి వచ్చిన పద్మ తన భర్త శ్రీనివాస్‌ను, ఆయనతో సహ జీవనం చేస్తున్న సంధ్యను తీవ్రంగా కొట్టారు. సిరిసిల్ల పోలీసులకు సమాచారం అందడంతో ఇరువర్గాలకు చెందిన వారిని స్టేషన్‌కు తరలించి సంఘటనపై విచారణ చేస్తున్నారు. కాగా ఇద్దరు ఉపాధ్యాయులైన భార్యభర్తల మధ్య అక్రమ సంబంధం వ్యవహరం వెలుగు చూడటంతో దాడి జరగడం సిరిసిల్లలో చర్చనీయాంశంగా మారింది.

Comments

comments