అక్రమ మద్యం, గుట్కా, నకిలీ విత్తనాలు పట్టివేత…

కొమురంభీం ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ట్కాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో పోలీసులు అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లు, నకిలీ పత్తి విత్తనాలను గుర్తించారు. జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగన్‌వార్ ఆదేశానుసారం ట్కాస్‌ఫోర్స్ సిఐ రాంబాబు తన టీం సభ్యులు వెంకటేశ్, సునీతలతో కలిసి సోదాల్లో పాల్గొన్నారు. సుమారు రూ. 10 వేల విలువ గల మద్యం బాటిళ్లు, రూ. వేయ్యి విలువ గల గుట్కా […]

కొమురంభీం ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ట్కాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో పోలీసులు అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లు, నకిలీ పత్తి విత్తనాలను గుర్తించారు. జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగన్‌వార్ ఆదేశానుసారం ట్కాస్‌ఫోర్స్ సిఐ రాంబాబు తన టీం సభ్యులు వెంకటేశ్, సునీతలతో కలిసి సోదాల్లో పాల్గొన్నారు. సుమారు రూ. 10 వేల విలువ గల మద్యం బాటిళ్లు, రూ. వేయ్యి విలువ గల గుట్కా ప్యాకెట్లు, రూ. 62 వేల విలువ గల పత్తి నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Related Stories: