అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు

case has been registered against two persons selling illegal liquor
కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్ పట్టణంలోని సర్‌సిల్క్ కాలనీలో బుధవారం జిల్లా టాస్క్‌ఫోర్స్ సిఐ అల్లం రాంబాబు ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా అక్రమ మద్యం సీసాలను స్వాధీనపర్చుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో టాస్క్‌ఫోర్స్ సిఐ అల్లం రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం… సర్‌సిల్క్ కాలనీ వార్డు నెంబర్ 5లో బెల్టు షాపుల ద్వారా అక్రమ మద్యం విక్రయిస్తున్నారనే ముందస్తు సమాచారం మేరకు ఉదయం సోదాలు నిర్వహించగా, వెంకట సదానందం అనే వ్యక్తి ఇంట్లో 2870 విలువ గల బీర్లు, విస్కి ఇతర బాటిళ్లు లభ్యమైనట్టు తెలిపారు. వార్డు నెంబర్ 3లో తనిఖీలు చేపట్టగా, తలుపునూరి రవీందర్ గౌడ్ అనే వ్యక్తి ఇంట్లో 5075 రూపాయల విలువ గల పలు బ్రాండ్ల మద్యం సీసాలు దొరికినట్టు తెలిపారు. మద్యం సీసాలను స్వాధీనపర్చుకొని ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. ఈ తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వెంకటేష్, జావిద్ హుస్సేన్, సునీతలు పాల్గొన్నారు. అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారి గురించి ఈ సెల్ నెంబర్ 9000926208 కు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచి దాడులు నిర్వహిస్తామని సిఐ రాంబాబు పేర్కొన్నారు.

Comments

comments