అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత..

pds

జయశంకర్ భూపాలపల్లి: అక్రమంగా డిసిఎం లో  తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని  జిల్లాలోని కాగారం మండల  కేంద్రం శివారులోని మద్దుల పల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నట్లు సిఐ శివప్రసాద్ తెలిపారు. అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని తరిలిస్తున్నరన్న సమాచారం మేరకు కాటారం మండల కేంద్రం శివారులోని మద్దులపల్లి చెక్ పోస్ట్ వద్ద డిసిఎం వ్యాన్ ను ఆపి తనిఖీ చేయగా అందులో సుమారు 110 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం బస్తాలు కనిపించయని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణానికి చెందిన నానవేని కుమార్, టేకుమట్లకు చెందిన కంచె రాజ్‌కుమార్ డిసిఎం వ్యాన్‌లో బియ్యాన్ని పరకాల నుంచి మహారాష్ట్రలోని సిరొంచకు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. వ్యాన్‌ను సీజ్ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.

Comments

comments