అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

రాయికల్‌ః మండలంలోని అల్లీపూర్ అటవీ ప్రాంతం నుండి టేకు కలప ను ట్రాక్టర్‌లో అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో గ్రామస్థులు వాచర్ సహయంతో ఆదివారం పట్టుకున్నారు. పట్టుకున్న టేకు దుంగలను వదిలేసిన దుండగులు ట్రాక్టర్‌తో సహా పరారయ్యారు. గ్రామస్థులు, అటవీ సెక్షన్ అధికారి రాజరావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అల్లీపూర్ గ్రామశివారులోని అడవి నుండి 17 టేకు దుంగలను ట్రాక్టర్‌లో అక్రమంగా తరలిస్తున్నట్లు గ్రామస్థులకు సమాచారం అందింది. అల్లీపూర్-కుర్మపెల్లి గ్రామాల మధ్య గ్రామ వాచర్ సహకారంతో […]

రాయికల్‌ః మండలంలోని అల్లీపూర్ అటవీ ప్రాంతం నుండి టేకు కలప ను ట్రాక్టర్‌లో అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో గ్రామస్థులు వాచర్ సహయంతో ఆదివారం పట్టుకున్నారు. పట్టుకున్న టేకు దుంగలను వదిలేసిన దుండగులు ట్రాక్టర్‌తో సహా పరారయ్యారు. గ్రామస్థులు, అటవీ సెక్షన్ అధికారి రాజరావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అల్లీపూర్ గ్రామశివారులోని అడవి నుండి 17 టేకు దుంగలను ట్రాక్టర్‌లో అక్రమంగా తరలిస్తున్నట్లు గ్రామస్థులకు సమాచారం అందింది. అల్లీపూర్-కుర్మపెల్లి గ్రామాల మధ్య గ్రామ వాచర్ సహకారంతో ట్రాక్టర్‌ను గ్రామస్థులు అడ్డుకున్నారు. గమనించిన దుండగలు టేకు కలపను వదిలేసి ట్రాక్టర్‌లోనే పరారైయ్యారు. ఇది రంగపేట గ్రామానికి చెందిన కలప స్మగ్లర్ల పనే అయి ఉంటుందని విచారణ జరిపి పట్టుకొని కేసు నమోదు చేస్తామని ఎఫ్‌ఎస్‌ఓ చెప్పారు.

Comments

comments

Related Stories: