అక్రమంగా ఆవులను తరలిస్తున్న వారి అరెస్టు

Police Caught the Cows at Mandamarri

మంచిర్యాల : మందమర్రిలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న వారిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కుమ్రంభీం జిల్లా కౌటాలా నుంచి మూడు డిసిఎం వ్యాన్లు, ఐదు జీపుల్లో వందకు పైగా ఆవులను , ఎద్దులను , బర్రెలను హైదరాబాద్‌ని గోవధశాలకు తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో మాటువేసి వీరిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. వాహనాలను, ఆవులను, ఎద్దులను, బర్రెలను స్వాధీనం చేసుకున్నామని వారు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.

Police Caught the Cows at Mandamarri