అక్టోబర్ 2నుంచి అన్నా హజారే దీక్ష

ముంబయి : అవినీతిని నిరోధించేందుకు లోక్‌పాల్‌ను నియమించాలని సామాజికవేత్త అన్నా హజారే పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే లోక్‌పాల్ నియామకంలో కేంద్రం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ అన్నా హజారే అక్టోబరు 2వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేయనున్నారు. మహారాష్ట్రలోని తన సొంత గ్రామమైన రాలేగావ్ సిద్ధిలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా లోక్‌పాల్ కోసం దీక్ష చేస్తానని హజారే వెల్లడించారు. లోక్‌పాల్ బిల్లుకు 2014 జనవరిలో రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అయితే లోక్‌పాల్‌ను నియమిస్తామని ఇచ్చిన […]

ముంబయి : అవినీతిని నిరోధించేందుకు లోక్‌పాల్‌ను నియమించాలని సామాజికవేత్త అన్నా హజారే పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే లోక్‌పాల్ నియామకంలో కేంద్రం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ అన్నా హజారే అక్టోబరు 2వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేయనున్నారు. మహారాష్ట్రలోని తన సొంత గ్రామమైన రాలేగావ్ సిద్ధిలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా లోక్‌పాల్ కోసం దీక్ష చేస్తానని హజారే వెల్లడించారు. లోక్‌పాల్ బిల్లుకు 2014 జనవరిలో రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అయితే లోక్‌పాల్‌ను నియమిస్తామని ఇచ్చిన హామీని కేంద్రం నిలుపుకోలేకపోయిందని ఆయన ధ్వజమెత్తారు. తక్షణమే లోక్‌పాల్‌ను నియమించాలని హజారే కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Anna Hazare to go on hunger strike from October 2nd

Comments

comments