అంబులెన్స్ లో కరుణానిధి భౌతికకాయం తరలింపు…

karunanidhi dead body move in ambulance

చెన్నై: కరుణానిధి భౌతికకాయాన్ని అంబులెన్స్ లో తరలిస్తున్నారు. భౌతికకాయం వెంట కరుణానిధి కుటుంబసభ్యులు, సన్నిహితులు ఉన్నట్టు సమాచారం. కావేరి ఆసుపత్రి, గోపాలపురంలోని నివాసం వద్ద డిఎంకె కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నట్టు సమాచారం. తమ అభిమాన నేత కరుణానిధి మృతిని జీర్ణించుకోలేని అభిమానుల రోదనలు మిన్నంటున్నాయి. కాగా కావేరి ఆసుపత్రి వద్ద, గోపాలపురంలోని నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. డిఎంకె పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె. స్టాలిన్ తమిళనాడు సిఎం పళనిస్వామి, ఆయన కుటుంబ సభ్యులు, డిఎంకె నేతలు కలిసి మెరినా బీచ్‌లో అన్నాదురై సమాధి దగ్గర ఖననం చేసేందుకు అనుమతించాల్సిందిగా కొరారు.  న్యాయపరమైన చిక్కులు వస్తాయని పేర్కొంటూ ప్రభుత్వం అక్కడ అంత్యక్రియలకు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించేందుకు డిఎంకె నేతలు సిద్ధపడుతున్నట్టు సమాచారం.

Comments

comments