అంబరాన్నంటిన సంబరాలు

fator

-కార్మికులు కుటుంబాల్లో వెల్లువిరిసిన ఆనందోత్సవాలు
-ఎంఎల్‌ఏ కోనేరు కోనప్పని దేవుడిగా కోలుస్తున్న కార్మికులు
-సి.ఎం. కెసిఆర్, మంత్రి కెటిఆర్‌కి రుణపడి ఉంటామంటున్న
వ్యాపారస్తులు, కార్మికులు

మనతెలంగాణ/కాగజ్‌నగర్‌రూరల్: సిర్పూర్‌కాగజ్‌నగర్ పేపర్‌మిల్లుతిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుండడంతో కాగజ్‌నగర్ మండలంలోని ఇస్‌గాం, నజ్రుల్ నగర్ క్యాంప్1, నుండి మొదలుకోని 13వ క్యాంపులతో పాటు భట్‌పెల్లి,కోసిని,అందేవెల్లి,వంజిరి,రస్‌పెల్లి,చింతగూడా,కోయవాగుసమీ పంలో ఉన్న ఎస్పీయం కార్మికుల ఇండ్లలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్బంగా కాగజ్‌నగర్ మండలంలో గత మూడు సంవత్సరాలుగా బిజినెస్ లేకా ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తులు తమ అభిప్రాయం వ్యక్తం చేసారు.
-విదేవ్ సర్కార్ ్ర(పిన్స్ టైలర్ షాపు, ఇస్‌గాం)
కాగజ్‌నగర్‌లో ఎస్పీయం ప్యాక్టరీ మూతపడినప్పటినుండి గత మూడు సంవ త్సరాలుగా ఎలాంటి గిరాకీలు లేకా తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చిందని, షాఫు కిరాయి కట్టేందుకు కూడా ఎంతో ఇబ్బంది పడాల్సివచ్చిందంటూ ఆయన తమ అవేదన వ్యక్తం చేసారు. ఇప్పుడు కంపెనీ మళ్లీ పారంభమవుతుందంటే ఎంతో సం తోషంగా ఉంది అంటూ తెలంగాణ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
-సూరజ్ బైరగి (పుట్‌వేర్ షాఫు-నజ్రుల్‌నగర్)
ఎస్పీయం పున ప్రారంభం కావడం ఎంతోసంతోషంగా ఉందిఅని ఆయన అన్నారు. ఈసందర్బంగా మంత్రి కేటిఆర్‌గారికి,మనఎం,ఎల్,ఏ కోనేరు కోనప్ప గారికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు మాకు కొంతధైర్యం ఏర్పడింది కంపెని చాలు అయితే మాకు గిరాకి కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
-మౌల్కార్ శివ( శ్రీ సాయి ఫోటో స్టూడియో-ఇస్‌గాం)
కాగజ్‌గనర్‌లో ఉన్నా ఎస్పీయం ప్యాక్టరి మన దేశంలోనే అతి పెద్ద పేపరుమిల్ మల్లి రి ఓపేను అవుతుందని తెలియడంతో ఇక్కడ నివసిస్తున్న కొందరు కార్మిక మిత్రులు మళ్లీ తిరిగి మనగ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. పేపర్ మిల్ ఓపెన్ కావడంద్వారా మాకు గిరాకీ పెరుగుతుంది. గత మూడు సంవత్స రాలుగా ఎలాంటి గిరాకీ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాము. పేపర్‌మిల్ ఓపెను కావ డానికి మన ఎం.ఎల్.ఏ కోనేరు కోనప్ప ఎంతోకష్టపడి మళ్లీ ఓపెను చేయు స్తున్నాడు కార్మికులకు మాలాంటి వ్యాపారుస్తులకు కోనప్ప దేవుడిగా కనిపిస్తు న్నాడని ఈ సందర్బంగా ఆయన ఆనందాన్ని వ్యక్తంచేశాడు.
-బొమ్మగిరి సతీష్‌గౌడ్, (గీత కార్మికులు, ఇస్‌గాం)
సిర్పూర్ పేపర్‌మిల్ పునః ప్రారంభం కావడంలో ఎం.ఎల్.ఏ కోనేరు కోనప్ప గారి పట్టుదల ఎంతో ఉంది అని, ఆయనని దేవుడిగా భావిస్తున్నాని ఆయన ఉద్రే కంతో అన్నారు. కోనప్ప ఎస్పీయం కోరకు మూడున్నర సంవత్సరాలుగా కంటి మీద కునుకులేకుండా శ్రమించి ఎస్పీయం పునఃప్రారంభమయ్యేటట్లు చేసా రని ఆయన అన్నారు.
– కోనేరు కోనప్ప, ఎం.ఎల్.ఏ (సిర్పూర్)
అదివారం రాత్రి సిర్పూర్ ఎంఎల్‌ఏ కోనేరు కోనప్ప హైదరాబాద్ నుండి తిరిగి కాగజ్‌నగర్‌కి వసున్నాడని తెలసుకున్న ఎస్పీయం కార్మికులు ప్రజలు కాగజ్‌నగర్ బైపాస్ రోడ్ వేల్‌కమ్ గేట్ నుండి ఉరేగింపుగా ఎదుర్కొని పూలతో హారతు లతో విజయతిలకం దిద్ది ఆయనకు జైజైలు కోట్టారు కొందరు కార్మికులు అతని కాళ్లపై పడి కన్నీరు మున్నీరుగా ఎడ్చారు నీవు దేవుడివి అని అభిమానంతో హత్తుకొని అలాయిబలాయి చేసు కున్నారు. బ్యాండ్ భాజాలతో టపాసులతో ఉరే గింపుగా ఎంఎల్‌ఏ కోనేరు కోనప్పని స్ధానిక ఎన్‌టిఆర్ చౌరస్తావరకు ర్యాలీగా తీసుకువచ్చారు.అనంతరం ఎం.ఎల్.ఏ కోనేరు కోనప్పకి కార్మికుల కుటుంబాల నుండి బారీగా మహిళలు హారతులతో స్వాగతం పలికారు కోనేరు కోనప్ప గారికి మిఠాయి తినిపించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా కోనేరు కోనప్ప మాట్లాడుతూ ఎస్పీయం కార్మికులకు మంచిరోజులువచ్చాయి, గతంలో ఎస్పీయంలో ఎంతమంది అయితే పనిచేసారో అంతమందికి న్యాయం జరుగు తుంది అందరు పనిచేస్తా రు అని చెప్పారు. మనతెలంగాణ ప్రభుత్వం మాట మీద నిలబడే ప్రభుత్వమని అన్నారు. ముఖ్యమంత్రి కే.సి ఆర్, మంత్రివర్యులు కేటిఆర్‌వారివలనే కంపేని పునః ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. త్వర లోనే కంపేని సందర్శించడానికి మన ముఖ్యమంత్రి కేసి ఆర్ మరియు కేటిఆర్ గార్లు వస్తున్నారని ఆయన తెలిపరు. నేను ఆంద్రావాన్ని కాదని అందరివాన్ని అని ఆయన అన్నారు. దీంతో కార్మికులు తమ ఆనందోత్సవాన్ని ఒక్కసారిగా కేకలు, జైజైలు కొట్టారు.

Comments

comments