అందులో అవకతవకలు జరిగాయి: అనిల్ సింఘాల్

తిరుమల: సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఇఒ అనిల్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.9 కోట్లతో ఇంజనీరింగ్ పనులను పూర్తి చేశామని, అమరావతి దేవాలయం పనులను నవంబర్ నెలలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. పిఎసి భవనం నిర్మాణానికి రూ.79 కోట్లతో త్వరలో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆన్‌లైన్ లక్కీడీప్ విధానంలో అవకతవకలు జరిగాయని, వాస్తవమేనని పేర్కొన్నారు. ఒకే ఈ మెయిల్ ఐడి ద్వారా […]

తిరుమల: సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఇఒ అనిల్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.9 కోట్లతో ఇంజనీరింగ్ పనులను పూర్తి చేశామని, అమరావతి దేవాలయం పనులను నవంబర్ నెలలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. పిఎసి భవనం నిర్మాణానికి రూ.79 కోట్లతో త్వరలో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆన్‌లైన్ లక్కీడీప్ విధానంలో అవకతవకలు జరిగాయని, వాస్తవమేనని పేర్కొన్నారు. ఒకే ఈ మెయిల్ ఐడి ద్వారా టికెట్లను పొందేవారి వివరాలు సేకరించామన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 1952 నుంచి తిరువాభరణం రిజిస్టర్‌లో పొందు పరిచిన విధంగా అన్ని అభరణాలు భద్రంగా ఉన్నాయని చెప్పారు.

Comments

comments

Related Stories: