అంతా లోకల్

దశాబ్దాల కల సాకారం చేసిన కెసిఆర్ మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.  ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉదయం గెజిట్‌ను విడుదల చేసింది. కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా గెజిట్ నోటిఫికేషన్‌ను వెలువరించింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగ సం ఘాల ప్రతినిధులు, […]

దశాబ్దాల కల సాకారం చేసిన కెసిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.  ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉదయం గెజిట్‌ను విడుదల చేసింది. కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా గెజిట్ నోటిఫికేషన్‌ను వెలువరించింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగ సం ఘాల ప్రతినిధులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ వచ్చినప్పు డు కలిగినంత సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. రానున్న మూడే ళ్ళ వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని పోస్టులనూ ఈ కొత్త విధానం ప్రకారం పునర వ్యవస్థీకరించాలని గెజిట్ పేర్కొనింది. అయితే ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఇప్పటికే అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసి కొత్తగా అమల్లోకి వచ్చే జోనల్ వ్యవస్థ ప్రకారం ఆయా శాఖల్లో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను వర్గీకరించి సర్వీసు మరో 36 వేల ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయ్యాయ ని, త్వరలోనే భర్తీ కావడానికి వివిధ దశల్లో ఉన్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మొత్తం 40,291 పోస్టుల్ని భర్తీ చేయడానికి ప్రభు త్వం అనుమతి ఇవ్వగా ఇప్పటికే 36,204 పోస్టుల భర్తీ కోసం 100 నోటిఫికేషన్ల ను జారీ చేసింది. ఇందులో 13,420 పోస్టుల్ని (ఆగస్టు 27 నాటికి) భర్తీ చేయగా మరో 20 వేల పోస్టుల భర్తీ వివిధ దశల్లో ఉంది. జోనల్ ఉత్తర్వులకు నిబంధనలను మార్చుకుని సిద్ధంగా ఉండాల్సిందిగా స్పష్టం చేశారు. జూనియర్ అసిస్టెంట్ మొదలు డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు, ‘పే స్కేల్’ను కూడా పరిగణనలోకి తీసుకుని కేడర్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని స్పష్టం చేశారు. నూతన విధానం ప్రకారం జిల్లా స్థాయిలో జూనియర్ అసిస్టెంట్ లేదా ఆ సమాన స్థాయి వరకు ఉండే ఉద్యోగాలు ఉంటాయి. జోనల్ పరిధిలో జూనియర్ అసిస్టెంట్ మొదలు సూపరింటెండెంట్ స్థాయి వరకు ఉంటాయి. మల్టీ జోనల్ స్థాయిలో సూపరింటెండెంట్ స్థాయి దాటింది మొదలు డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఉంటాయి. ఒకవేళ ఏదేని పోస్టుకు స్థానిక అభ్యర్థి లభించకపోయినట్లయితే గరిష్టంగా మూడేళ్ళ వరకు ఆ పోస్టుల్ని తదుపరి రిక్రూట్‌మెంట్‌కు కలుపుతూనే ఉండాలని గెజిట్ స్పష్టం చేసింది. ఒకటవ తరగతి మొదలు ఏడవ తరగతి వరకు ఏడేళ్ళలో వరుసగా నాలుగేళ్ళపాటు ఎక్కడ చదివారో వారు ఆ ప్రాంత స్థానికులుగా గుర్తించబడతారని పేర్కొనింది.
ఉద్యోగాల భర్తీలో విప్లవాత్మక విజయం :
ఈ నూతన విధానం ప్రకారం రాష్ట్రస్థాయి కేడర్ రద్దుకావడంతో ఆ స్థాయి పోస్టులన్నీ పదోన్నతుల ద్వారానే భర్తీ కానున్నాయి. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లో 95% రిజర్వేషన్ స్థానికులకు లభించనుంది. మిగిలింది ఓపెన్ కేటగిరీగా ఉంటుంది. ఇకపైన రాష్ట్రస్థాయి కేడర్ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉండదు. ఇంతకాలం రాష్ట్రస్థాయి పోస్టులుగా ఉన్న 34 రకాలను మల్టీజోనల్‌లో కలపడంతో ఇకపైన నియామకం కూడా 95% రిజర్వేషన్ ప్రాతిపదికన స్థానిక యువతకే లభిస్తుంది. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం లభించడానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి ఒక్కో శాఖ నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్ళేంతవరకు ప్రతీ కదలికను పరిశీలిస్తూ పర్యవేక్షించారు. ఇక ముఖ్యమంత్రి కెసిఆర్ గడచిన రెండు నెలల వ్యవధిలో మూడుసార్లు ఢిల్లీకి వెళ్ళి స్వయంగా ప్రధానితో చర్చించారు. ఎట్టకేలకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడడంతో తెలంగాణ మరో విప్లవాత్మకమైన విజయాన్ని సాధించింది.

ఫలించిన సిఎం కెసిఆర్ కృషి :
ఈ ఏడాది మే నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన కసరత్తు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవలి ఢిల్లీ పర్యటనతో కొలిక్కివచ్చింది. ప్రధాని నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి భేటీ అయిన సందర్భంగా స్వయంగా కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి ఆమోదం తెలపాల్సిన అవసరం, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు లభించే న్యాయం, ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ యువతకే న్యాయం జరగడం తదితర అంశాలన్నింటినీ వివరించారు. రాష్ట్రపతి 1975లో జారీ చేసిన 371 డి ఉత్తర్వులకు సవరణ చేసేలా చొరవ తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అప్పటికప్పుడే ఈ ఫైల్‌పై సంతకం చేసిన ప్రధాని కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపించారు. కొత్త జోన్ల విధానంపై వీలైనంత తొందరగా రాష్ట్రపతి భవన్‌కు పంపాల్సిందిగా హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌తోనూ కెసిఆర్ చర్చించారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్ళడంతో ఆమోదం లభించి గెజిట్ విడుదలైంది. గత రెండు నెలలుగా ఢిల్లీ స్థాయిలో సిఎం కెసిఆర్ చూపిన చొరవ, కృషి గెజిట్ రూపంలో ఫలించింది. ‘నీళ్ళు, నిధులు, నియామకాలు’ అనే మూడు ప్రధాన ఉద్యమ అంశాల్లో ఇప్పటికే నీళ్ళ విషయంలో అనేక ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతూ త్వరలో ఫలితాలు ఇచ్చే దశలో ఉండగా, నిధుల విషయంలో దేశంలోనే గుర్తింపు తెచ్చుకోగలిగిన స్థాయిలో జిఎస్‌డిపి వృద్ధి రేటుతో పాటు స్వీయ ఆదాయ వనరుల పెంపు, ఆర్థిక వృద్ధి రేటు, తలసరి ఆదాయం పెరగడం తదితరాలను సాధించింది. ఇక మిగిలిన నియామకాల విషయంలోనూ ఇప్పుడు కొత్త జోనల్ వ్యవస్థతో సంపూర్ణ న్యాయం లభించినట్లయింది.
95% ఉద్యోగాలు స్థానికులకే :
కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడంతో ఇకపైన ఉద్యోగాల భర్తీలో 95 శాతం అవకాశాలు స్థానికులకే దక్కనున్నాయి. కొత్త విధానం ప్రకారం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే రిజర్వేషన్ లభిస్తుంది. కేవలం 5 శాతం మాత్రమే ఓపెన్ క్యాటగిరీకి అవకాశం ఉంటుంది. స్థానికులు మెరిట్ సంపాదించుకొని ఓపెన్ క్యాటగిరీలోనూ ఉద్యోగం పొందే అవకాశాన్ని ప్రభుత్వం ఈ విధానం ద్వారా కల్పించింది. రాష్ట్ర క్యాడర్‌ను రద్దు చేయడంతో ఈ 5 శాతం ఓపెన్ క్యాటగిరీలోనూ తెలంగాణలోని 31 జిల్లాలకు చెందిన నిరుద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతుంది. దీంతో ఉద్యోగాలన్నీ పూర్తిగా తెలంగాణ యువతకే దక్కుతాయి. పాలనాపరమైన సంస్కరణల్లో భాగంగా పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలను ఏర్పాటుచేసిన ప్రభు త్వం ఆయా జిల్లాల్లోని స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా కొత్త జోనల్ వ్యవస్థకూ శ్రీకారం చుట్టింది.

సమైక్య రాష్ట్రంలోని జోనల్ విధానం వలన తెలంగాణ ప్రాంతంలోని యువతకు జిల్లా, జోనల్, రాష్ట్ర క్యాడర్‌పోస్టుల భర్తీలో రిజర్వేషన్ల అమలులో అన్యాయం జరిగింది. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ‘నియామకాలు’ ప్రధాన డిమాండ్‌గా ముందుకొచ్చింది. పాత జోనల్ విధానం ప్రకారం జిల్లా పోస్టుల్లో 80 శాతం తెలంగాణకు (స్థానిక) దక్కగా 20 శాతం ఓపెన్ కేటగిరీకి ఉండేది. జోనల్ పోస్టుల్లో 70 శాతం లోకల్, 30 శాతం ఓపెన్, జోనల్ (గెజిటెడ్) పోస్టుల్లో 60 శాతం లోకల్, 40 శాతం ఓపెన్ క్యాటగిరీ కింద రిజర్వేషన్లు ఉండేది. రాష్ట్రస్థాయి పోస్టుల్లో స్థానిక రిజర్వేషన్‌కి అవకాశమే లేకుండా పూర్తిగా వందశాతం ఓపెన్ కేటగిరీగా ఉండేది. దీంతో తెలంగాణకు చెందినవారికి తగిన అవకాశాలు లభించక ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలవారే ఎక్కువగా అవకాశం పొందేవారు. ఓపెన్ క్యాటగిరీకి ‘నాన్ లోకల్’ అని పేరు పెట్టడంతో స్థానికేతరులే ఉద్యోగాలను కొల్లగొట్టిన చరిత్ర కనిపిస్తుంది. స్థానికులైన మెరిట్ అభ్యర్థులు కూడా లోకల్ రిజర్వేషన్‌లోనే ఉద్యోగాలు పొందేవారు. రాష్ట్రస్థాయి పోస్టుల్లో స్థానిక రిజర్వేషన్లు లేకపోవడంతో తెలంగాణ యువతకు తీరని అన్యాయం జరిగింది.
త్వరలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు :
కొత్తగా అమల్లోకి వస్తున్న జోనల్ వ్యవస్థ ప్రకారం రాష్ట్రంలో భర్తీ అయ్యే ఉద్యోగాలన్నింటా స్థానికులకు 95% రిజర్వేషన్ లభిస్తుంది. మిగిలిన 5% రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీగా ఉంటుండడంతో స్థానికేతరులకు అవకాశం లభిస్తుంది. త్వరలో భారీ స్థాయిలో ఉద్యోగాలకు ప్రభుత్వం భర్తీ నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశం ఉంది. దాదాపు 50 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
నిరుద్యోగ యువతకు న్యాయం
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రెండు జోన్ల స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పడడంతో 95% విధానం ద్వారా స్థానిక తెలంగాణ యువతకు విస్తృత అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర స్థాయి పోస్టులకు ప్రత్యక్ష నియామకాలను పూర్తిగా నిలిపివేసి కేవలం పదోన్నతుల ద్వారానే ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ప్రస్తుతం నాలుగు నుంచి పది తరగతుల్లో నాలుగేళ్లపాటు చదివినవారిని స్థానికులుగా గుర్తిస్తున్నారు.
ఇకపై ఒకటి నుంచి ఏడు తరగతుల్లో వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికులవుతారు. జిల్లా, జోన్లు, బహుళజోన్లు, రాష్ట్రస్థాయిలో ఎక్కడ వరుసగా నాలుగేళ్లు చదివితే అక్కడే వారు స్థానికులవుతారు. ఈ నూతన విధానంతో ఏ ప్రాంతం (జిల్లా, జోనల్) నిరుద్యోగులు ఆ ప్రాంతంవారితోనే పోటీ పడతారు. గ్రామీణ ప్రాంతం లేదా వెనకబడిన ప్రాంతంవారు ఇంతకాలం పట్టణాల అభ్యర్థులతో పోటీపడి అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఉండదు. దీంతో ఆయా జిల్లాలు, జోన్‌ల పరిధిలో అందరికీ సమానావకాశాలు లభిస్తాయి. పాత జిల్లాల పరిధిలో కాకుండా కొత్త జిల్లాల ఆధారంగా ఇకపైన ఉద్యోగాల నోటిఫికేషన్లు, నియామకాలు ఉంటాయి. దీర్ఘకాలంగా తెలంగాణ యువత ఎదురుచూస్తున్న గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

సమైక్య పాలకులు ఉద్యోగాలను కొల్లగొట్టారు. తెలంగాణ ఉద్యమ డిమాండ్లలో ‘నియామకాలు’ ము ఖ్యమైనది. కొత్త జోనల్ వ్యవస్థతో జరిగిన అన్యాయం, అసమానతలు పోయినట్లే. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతున్నాయి. జోనల్ వ్యవస్థ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యోగ సంఘాలతో చర్చించి 95% స్థానిక రిజర్వేషన్‌పై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నా రు. స్వయంగా ఢిల్లీ వెళ్ళి ప్రధానిని ఒప్పింది మెప్పించి రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు కృషి చేశారు.
కారెం రవీందర్ రెడ్డి, తెలంగాణ ఎన్‌జిఓ అధ్యక్షుడు

సమైక్య పాలకులు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పేరుతో తెలం గాణ ఉద్యోగాల్ని కొల్ల గొట్టారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో జోనల్ వ్యవస్థను రద్దు డిమాండ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. నూతన జోనల్ వ్యవస్థతో స్థానికేతరులకు ఐదు శాతం మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. అడ్డదారుల్లో స్థానికేతరులు ప్రవేశించకుండా ప్రత్యేకంగా పర్యవేక్షణ సెల్‌ను ఏర్పాటు చేయాలి.

పద్మాచారి, ఉద్యోగులసంఘం అధ్యక్షుడు

ఉమ్మడి పాలకుల అశాస్త్రీయమైన జోనల్ వ్యవస్థను రద్దుచేసి శాస్త్రీయ జోనల్ విధానాన్ని తెలంగాణ సాధించుకుంది. తెలంగాణ జోనల్ విధానంతో స్థానికులకే ఉ ద్యోగ అవకాశాలు దక్కుతాయి. తెలంగాణ ఉద్యమంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కెసిఆర్ పూర్తి చేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల అంశంపై సాగిన తెలంగాణ ఉద్యమంలో నీళ్లను సాధించుకున్నాం, నిధుల కొరత లేదు. నియామకాలకు ఉన్న అడ్డంకులు తొలిగి పోయాయి.సిఎం కెసిఆర్‌కు ప్రజలు రుణపడి ఉంటారు.

దేవిప్రసాద్, ఉద్యోగసంఘాల గౌరవ అధ్యక్షుడు

ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని నిరుద్యోగులు చేసిన వీరోచి త పోరాటంతో తెలంగాణ సాకార మయింది. పాత జోన్లకు పాతరేసి ప్రస్తుతం 31 జిల్లాలకు కావాల్సిన వ్యవస్థను రూపొం దించి బంగారు భవిష్యత్‌ను అందిస్తుంది. ఉద్యోగాలన్నీ స్థాని కులకే దక్కేలా జోన్ల ఏర్పాటుపై నిరుద్యోగులు ఆనం దంగా ఉన్నారు.
శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు

కొత్త జోనల్ వ్యవస్థతో జిల్లాల వారీగా స్థానికులకే ఉద్యోగాలు దక్కుతాయి. స్థానికేతరులు కొల్లగొట్టే వీలు ఉండదు. ఉమ్మ డి పాలకుల జోనల్ వ్యవస్థను రద్దు చేస్తానని ఇచ్చిన వాగ్ధా నాన్ని కెసిఆర్ నిల బెట్టుకు న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నప్పుడు కలిగిన ఆనందోత్సాహాలు ప్రజల్లో మరొక్కసారి వెల్లివిరిశాయి.
మమత, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు

Related Stories: