అంతా రాజన్ వల్లే..

Raghuram Rajan speech about dimonetaijeshn

ఆయన విధానాల వల్లే వృద్ధిరేటు మందగించింది
డీమానిటైజేషన్ వల్ల కాదు
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్

న్యూఢిల్లీ: డీమానిటైజేషన్(నోట్ల రద్దు) అనంతరం దేశీయ ఆర్థిక వ్యవస్థ మందగించడానికి ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ విమర్శించారు. నిరర్థక ఆస్తుల(ఎన్‌పిఎ)పై రాజన్ చేపట్టిన విధానాల కారణంగా దేశీయ వృద్ధి రేటు క్షీణిస్తూ వచ్చిందని, అంతేగానీ ప్రభుత్వం తీసుకున్న రూ.500, రూ.1000 నోట్ల రద్దు వల్ల కాదని మీడియాతో ఆయన అన్నారు. ‘డీమానిటైజేష న్ అనంతరం వృద్ధి రేటు నెమ్మదించడానికి నోట్ల రద్దు నిర్ణ యం కారణం కాదు, ఆర్థిక వ్యవస్థలో క్షీణిస్తున్న ధోరణే కారణం. 201516 ఆఖరి త్రైమాసికం నుంచి వరుస గా ఆరు త్రైమాసికాలు వృద్ధి రేటు తగ్గుతూ వచ్చింది’ అని కుమార్ అన్నారు. రఘురాం రాజన్‌పై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. బ్యాంకింగ్ రంగంలో పేరుకుపోయిన మొండి బకాయిలు లేదా ఎన్‌పిఎల విషయంలో ఆర్‌బిఐ మాజీ గవర్నర్ తీసుకున్న నిర్ణయాలు వృద్ధి రేటుపై ప్రభావం చూపాయన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పుడు రూ.4 లక్షల కోట్లుగా ఉన్న ఎన్‌పిఎ లు.. రాజన్ నిర్ణయాల కారణంగా 2017 ద్వితీయార్థం నాటికి రూ.10.5 లక్షల కోట్లకు చేరాయని ఆయన వివ రించారు. ఎన్‌పిఎలను గుర్తించడానికి రాజన్ కొత్త యం త్రాంగం ఏర్పాటు చేశారని, క్రమంగా మొండి బకాయిలు పెరుగుతూ పోయాయని, దీంతో బ్యాంకింగ్ రంగం కంపెనీలకు రుణాలను నిలిపివేసిందని రాజీవ్ పేర్కొన్నా రు. వాస్తవానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కు (ఎంఎస్‌ఎంఇ) రుణాలు క్షీణించగా, ఇది కొన్నేళ్లలో ప్రతికూల వృద్ధికి కారణమైందని తెలిపారు. చిన్న తరహా వ్యాపారాల్లోనే కాదు.. భారీ పరిశ్రమల విషయంలోనూ రుణాల క్షీణత 1.5 శాతం, 2 శాతానికి పడిపోయింది. ఇది కూడా కొన్ని త్రైమాసికాల్లో ప్రతికూలంగా మారింది. దీంతో జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) క్షీణించిందని ఆయన అన్నారు. పరిస్థితిని గమనించిన ప్రభుత్వం మూలధన వ్యయం పెంచాల్సి వచ్చిందని, దీనికి తోడు ఆ సమయం లో చమురు రేట్లు తగ్గుముఖం పట్టడం కొంత ఊరటని చ్చిందని కుమార్ వివరించారు.

201718 రెండో త్రై మాసికం నుంచి వృద్ధి రేటులో పెరుగుదలను చూస్తున్నామని అన్నారు. వృద్ధి రేటులో ఆర్థిక మందగమనం, డీమా నిటైజేషన్ మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయన డానికి రుజువులేమీ లేవని భావిస్తున్నానని ఆయ అన్నారు. ఆర్‌బిఐ ఇటీవల నోట్ల రద్దుపై ఇచ్చిన నివేదికపై కుమార్ స్పందిస్తూ.. దేశీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న నల్లధనం, బినామీ లావాదేవీలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రభు త్వం డీమానిటైజేషన్ నిర్ణయం తీసుకుందని పునరుద్ఘా టించారు. కాగా 2016 నవంబరులో పెద్ద నోట్లు రద్దుతో మొత్తం రూ.15.41లక్షల కోట్లు వెనక్కి వచ్చిందని ఆర్‌బిఐ నివేదికలో తెలిపింది. తిరిగి రూ.15.31లక్షల కోట్లు కొత్త నోట్ల రూపంలో వ్యవస్థలోకి పంపినట్టు రిజర్వ్ బ్యాంకు పేర్కొంది. అంటే రూ.10,720 కోట్ల విలువైన నోట్లు మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగిరాలేదు.

నల్లధన కట్టడి, అవినీతి నిరోధానికి 2016 నవంబరు 8న పెద్ద నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. 201819 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో(ఏప్రిల్‌జూన్) జిడిపి రెండేళ్ల గరిష్ఠానికి చేరి 8.2 శాతం నమోదు చేసింది. గత నెల 31న ఈ జిడిపి(స్థూల జాతీయోత్పత్తి) వృద్ధి రేటు గణాంకాలను ప్రభుత్వం ప్రకటిం చింది. జూలై త్రైమాసిక జిడిపి వృద్ధి రేటు 7.7 శాతంతో పోలిస్తే ఆగస్టులో గణనీయంగా పెరిగింది. అయితే 201718 తొలి త్రైమాసిక జిడిపి 5.59గా ఉంది. తొలి త్రైమాసికంలో స్థూల విలువ ఆధారిత(జివిఎ) వృద్ధి రేటు 8 శాతంగా ఉంది. ఆర్థిక పురోగతి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుందని ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. 201617 తొలి త్రైమాసిక వృద్ధి రేటు తర్వాత మళ్లీ ఇప్పుడు 8 శాతం వృద్ధి రేటుకు చేరింది. ఎనిమిది త్రైమాసికాల తర్వాత ఇప్పుడు మళ్లీ 8.2 శాతం వృద్ధి రేటుకు చేరడం గమనార్హం.

Comments

comments