అండర్సన్‌కు జరిమానా..!

England Seamer James Anderson has been fined

లండన్: ఓవల్ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ఆఖరిదైన ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో వాగ్వాదానికి దిగిన ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్స్‌న్‌కు షాక్ తగిలింది. అంపైర్ నిర్ణయంపై అండర్సన్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు కోహ్లితో వాగ్వాదానికి దిగిన నేపథ్యంలో మ్యాచ్‌ రిఫరీ అతడిపై చర్యలు తీసుకున్నారు. ఐసిసి క్రీడా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అండర్స్‌న్‌ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాక క్రమశిక్షణా చర్యల కింద ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా వేశారు. మ్యాచ్ రెండో రోజు ఆటలో భారత ఇన్నింగ్స్‌లో అండర్సన్ వేసిన 29వ ఓవర్‌లో బంతి విరాట్ కోహ్లి ప్యాడ్లను తాకింది. దీంతో అండర్సన్ ఎల్బిడబ్ల్యూకు అప్పీల్ చేశాడు. కానీ, అంపైర్ కుమార ధర్మసేన నాటౌట్‌గా ప్రకటించాడు. దాంతో ఇంగ్లండ్ రివ్యూ కోరిన నిరాశే ఎదురైంది. దీనితో ఆగ్రహానికి గురైన అండర్సన్‌ ఆవేశంతో అంపైర్‌ ధర్మసేనతో పాటు కోహ్లితో వాగ్వాదానికి దిగాడు. ఇది ఐసిసి క్రీడా నిబంధన 2.1.5కు విరుద్దం కావడంతో అండర్సన్‌కు మ్యాచ్‌ రిఫరీ ఫైన్ వేశారు.

Comments

comments