అంజన్న మమ్మల్ని వదిలి వెళ్లి ఎంత పనిచేస్తివే

veterinary officer anjaiah died with heart attack

సిద్దిపేట: సిద్దిపేటలో పాడిగేదెలు పంపిణీ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ అధికారి అంజయ్య అంజయ్యకు గుండెపోటుతో కూప్పకులాడు. ఈ విషయం తెలుసుకున్నహరీశ్ రావు వెంటనే దవాఖానకు చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంజయ్య మృతదేహాన్ని చూసిన హరీశ్ కంటతడి పెట్టారు. అంజన్న మమ్మల్ని వదిలి వెళ్లి ఎంత పనిచేస్తివే అని దిగ్ర్భాంతికి లోనై ఆయన బోరున విలపించారు. తాము ఆత్మీయ అధికారిని కోల్పోయామన్నారు. ఒక ఆత్మీయ అధికారిగా, కుటుంబ సభ్యునిగా, వృత్తిలో నిబద్ధతగా, మంచికి మారుపేరుగా అంజన్న పనిచేశారని గుర్తు చేశారు. తమ మధ్యనుండి ఆయన వెళ్లి పోవడం తీవ్రంగా కలిచి వేసిందని హరీశ్ రావు పేర్కొన్నారు. 14 ఏళ్లు సిద్దిపేట లో ఒక ఇంటి మనిషిలా ఉండి, తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలను గుర్తు చేశారు హరీశ్. అధికారిగా అంజన్న మంచి సేవలు అందించారని కొనియాడారు. ఆయన అకాల మరణం సిద్దిపేటకు తీరని లోటని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

Comments

comments