అంచనాలకు అందని కివీస్

New-Zealand-Squad

మన తెలంగాణ / క్రీడావిభాగం : ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా పరిగణిస్తున్న న్యూజిలాండ్ భారీ అంచనాలతో టోర్నీకి సిద్ధమైంది. తనదైన రోజు ఎంత టి పెద్ద జట్టునైన ఓడించే సత్తా కివీస్‌కు ఉంది. వన్డే క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర జట్లలో ఒకటిగా న్యూజిలాండ్‌ను పరిగణిస్తారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఈ జట్టు సమతూ కంగా ఉంది. ఇంగ్లాండ్ పరిస్థితులు కూడా న్యూజిలాండ్‌కు అనుకూ లంగా ఉన్నాయి. కిందటి ప్రపంచకప్‌లో అసాధారణ ప్రతిభను కన బరిచిన న్యూజిలాండ్ ఫైనల్ వరకు చేరి ప్రకంపనలు సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ప్రపంచంలోనే అత్యంత విధ్వంసక బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న మార్టిన్ గుప్టిల్ ఈసారి జట్టుకు ప్రధాన ఆయు ధంగా మారాడు. అంతేగాక, అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ కొరె అండర్సన్ కూడా జోరుమీదున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న బోల్ట్, టీమ్ సౌథి కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు కెప్టెన్ కానె విలియమ్‌సన్ జట్టును ముందుండి నడిపించేందుకు తహతహలాడుతున్నాడు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌కు మంచి రికార్డు ఉంది. 2000లో కివీస్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. అంతేగాక, 2009లో రన్నరప్ సాధించింది. ఒకసారి సెమీస్‌కు మరోసారి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో 21 మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్ 12 పోటీ ల్లో విజయం సాధించింది. మరో ఎనిమి దింటిలో పరాజయం పాలైంది.
టేలర్, విలియమన్‌సన్‌లే కీలకం..
ఇక, న్యూజిలాండ్ బ్యాటింగ్ భారమంత కెప్టెన్ విలియమ్‌సన్, సీనియర్ ఆటగాడు రాస్ టేలర్‌పైన ఆధారపడి ఉంది. ప్రపంచం లోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లుగా వీరిద్దరు కొన సాగుతున్నారు. టేలర్ కొంతకాలంగా నిల కడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నా డు. క్లిష్ట సమయాల్లో అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదు కుంటున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఈ ట్రోఫీలో టేలర్ జట్టుకు కీలకంగా మారాడు. టేలర్ చెలరేగితే అడ్డుకోవడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టమే. ఇక, కెప్టెన్ విలియమ్‌సన్ కూడా జోరుమీదున్నాడు. అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఒంటిచేత్తో జట్టుకు పలు మ్యాచుల్లో విజయాలు సాధించి పెట్టాడు. ఈసారి కూడా జట్టును ముందుండి నడపిం చేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల ముగిసే ఐపిఎల్‌లో నిలక డైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒకవైపు జాగ్రత్తగా ఆడుతూనే అవ సరమైతే విధ్వంసక ఇన్నింగ్స్ ఆడే సత్తా విలియమ్‌సన్‌కు ఉంది. ఓపెనర్ లాథమ్, మార్టిన్ గుప్టిల్‌లు కూడా ప్రతిభా వంతులైన బ్యాట్స్‌మెన్‌లే. వీరు కూడా జోరు మీదున్నా రు. గుప్టిల్ చెలరేగితే అడ్డుకోవడం ఏ బౌలర్‌కైన చాలా కష్టం. గతంలో చాలా సార్లు అతను విధ్వంసక ఇన్నింగ్స్‌లతో న్యూజిలాండ్‌కు విజయాలు అందించాడు. లాథమ్ కూడా నిలకడగా బ్యాటింగ్ చేయడంలో దిట్ట. లుక్ రోంచి రూపంలో మరో మాస్టర్ బ్లాస్టర్ బ్యాట్స్‌మన్ జట్టుకు అందుబాటులో ఉన్నాడు. ఎటు వంటి బౌలింగ్‌నైన చిన్నాభిన్నం చేసే సత్తా అతనికుం ది.
ఆల్‌రౌండర్ల జట్టు..
మరోవైపు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లు కలిగిన జట్లలో కివీస్ ఒకటి. కొరె అండర్సన్, కొలిన్ డి గ్రాండోమ్, మెక్లెనగాన్ వం టి ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. ఇటీవల ముగి సిన ఐపిఎల్‌లో వీరంతా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. అండర్సన్ చెలరేగితే అడ్డుకోవడం ప్రత్యర్థి బౌలర్లకు చాలా కష్టం. గతంలో చాలా మ్యాచుల్లో అండర్సన్ ఒంటిచేత్తో కివీస్‌ను గెలిపించాడు. ఇక, బౌలింగ్‌లో కూడా కివీస్ చాలా బలంగా ఉంది. సౌథి, బోల్ట్, నిశమ్, ఆడమ్ మిల్నే, జతిన్ పటేల్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే ఇంగ్లాండ్ పిచ్‌లపై వీరంతా మెరుగ్గా రాణించడం ఖాయం. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ విభాగాల్లో ఎంతో బలోపేతంగా కనిపిస్తున్న న్యూజిలాండ్ భారీ ఆశలతో టోర్నీకి సిద్ధమైంది. అయితే మూడు దేశాల టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలుకావడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. కానీ, మళ్లీ పుంజుకును విజయాల బాట పట్టే సత్తా న్యూజిలాండ్‌కు ఉంది. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో కూడిన గ్రూపులో న్యూజిలాండ్ ఉంది.
జట్టు వివరాలు: కానె విలియమ్‌సన్ (కెప్టెన్), కొరె అండర్సన్, ట్రెంట్ బోల్ట్, మార్టిన్ గుప్టిల్, రాస్ టేలర్, టామ్ లాథమ్, నీల్ బ్రూమ్, మిఛెల్ మెక్లనగాన్, గ్రాండోమ్, ఆడమ్ మిల్నే, జేమ్స్ నిశమ్, లుక్ రోంచి, టీమ్ సౌథి, జీతెన్ పటేల్, మిఛెల్ సంట్నర్.

Comments

comments