అంగారక పరిశోధనకు పారాచ్యూట్ పరీక్ష

వాషింగ్టన్ : అంగారకునిపైకి త్వరలో వెళ్లనున్న పరిశోధక నౌక ‘రోవర్స్’ కోసం నాసా సౌండింగ్ రాకెట్‌ను శుక్రవారం ప్రయోగించింది. కాలిఫోర్నియా పసడెనాలోని నాసా జెట్ ప్రోపల్సన్ లేబోరేటరీ (జెపిఎల్) నుంచి ఈ రాకెట్ అడ్వాన్స్‌డ్ సూపర్‌సోనిక్ పారాచ్యూట్ ఇన్‌ఫ్లేషన్ రీసెర్చి ఎక్స్‌పెరిమెంట్ (ఎఎస్‌పిఇఆర్‌ఇ)ను మోసుకెళ్లింది. ఈ పేలోడ్ పారాచూట్ ద్వారా కిందకు దిగి అట్లాంటిక్ సముద్రంలో తునకలుగా మిగిలిపోయింది. పారాచ్యూట్ జయప్రదంగా తిరిగి కోలుకుని వాలప్స్ ద్వీపానికి చేరుకోగలిగిందని నాసా ప్రకటించింది. అంగారక గ్రహంపై దిగినప్పుడు పారాచ్యూట్ […]

వాషింగ్టన్ : అంగారకునిపైకి త్వరలో వెళ్లనున్న పరిశోధక నౌక ‘రోవర్స్’ కోసం నాసా సౌండింగ్ రాకెట్‌ను శుక్రవారం ప్రయోగించింది. కాలిఫోర్నియా పసడెనాలోని నాసా జెట్ ప్రోపల్సన్ లేబోరేటరీ (జెపిఎల్) నుంచి ఈ రాకెట్ అడ్వాన్స్‌డ్ సూపర్‌సోనిక్ పారాచ్యూట్ ఇన్‌ఫ్లేషన్ రీసెర్చి ఎక్స్‌పెరిమెంట్ (ఎఎస్‌పిఇఆర్‌ఇ)ను మోసుకెళ్లింది. ఈ పేలోడ్ పారాచూట్ ద్వారా కిందకు దిగి అట్లాంటిక్ సముద్రంలో తునకలుగా మిగిలిపోయింది. పారాచ్యూట్ జయప్రదంగా తిరిగి కోలుకుని వాలప్స్ ద్వీపానికి చేరుకోగలిగిందని నాసా ప్రకటించింది. అంగారక గ్రహంపై దిగినప్పుడు పారాచ్యూట్ ఎలాంటి అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అదేవిధమైన పరిస్థితులను కల్పించారు. ఇదొక విధంగా మార్స్ 2020 డిజైన్‌కు బలపరీక్ష అని జెపిఎల్‌కు చెందిన మెకానికల్ ఇంజినీర్ జెరెమీ హిల్ చెప్పారు. అంగారక వాతావరణానికి చేరువ కావాలన్నదే తమ ప్రయత్నంగా పేర్కొన్నారు. ఈ పేలోడ్ గొట్టాం వంటి ఆకారంతో సూది ముక్కుతో ఉంటుంది. దీనికి అనుసంధానించి సూపర్‌సోనిక్ పారాచ్యూట్ అమర్చి ఉంటుంది. పారాచ్యూట్ కిందకు దిగడం, పరీక్షించే సాధనాలు, కెమెరాలు ఇవన్నీ డేటాను సేకరిస్తాయి. మార్స్ 2020 రోవర్ మిషన్ 2020 జులై ఆగస్టు ప్రాంతంలో ప్రారంభించడానికి గడువు పెట్టడమైంది. భూమి, అంగారక గ్రహాలు రెండూ అభిముఖంగా ఉన్నప్పుడు ఈ ప్రయోగం నిర్వహిస్తారు. ఈ మిషన్ అంగారక గ్రహంపై జీవించడానికి తగిన అవకాశాలు ఉన్నాయా? గతంలో ప్రాణి ఏదైనా ఉండేదా? తదితర ప్రశ్నలకు తగిన సమాచారం రాబట్టేలా పరిశోధన సాగిస్తుంది.
 – సైన్స్ విభాగం

Comments

comments

Related Stories: