అంగారక దుమ్ముతుపాన్‌లో ఇరుక్కున్న నాసా వ్యోమ నౌక

వాషింగ్టన్ : దాదాపు గత పదిహేనేళ్లుగా అంగారక గ్రహంపై పరిశోధనలు సాగస్తున్న నాసా ఆపర్టూనిటీ రోవర్ వ్యోమనౌక భారీ ఇసుక దుమ్ము తుపాన్‌లో చిక్కుకుని రెండు నెలలుగా అచేతనంగా ఉంటోంది. ఈ దుమ్ము తుపాన్ వల్ల తన సౌరఫలకాల నుంచి స్వయం గా విద్యుత్ శక్తిని పొందలేని పరిస్థితి ఏర్పడడంతో అత్యవసరంగా గత జూన్ లో రోవర్‌ను మూసివేయివలసి వచ్చింది. అప్పటి నుంచి నాసా జెట్ ప్రొపల్సన్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు రోజూ రోవర్ నుంచి మెసేజ్ రాడానికి […]

వాషింగ్టన్ : దాదాపు గత పదిహేనేళ్లుగా అంగారక గ్రహంపై పరిశోధనలు సాగస్తున్న నాసా ఆపర్టూనిటీ రోవర్ వ్యోమనౌక భారీ ఇసుక దుమ్ము తుపాన్‌లో చిక్కుకుని రెండు నెలలుగా అచేతనంగా ఉంటోంది. ఈ దుమ్ము తుపాన్ వల్ల తన సౌరఫలకాల నుంచి స్వయం గా విద్యుత్ శక్తిని పొందలేని పరిస్థితి ఏర్పడడంతో అత్యవసరంగా గత జూన్ లో రోవర్‌ను మూసివేయివలసి వచ్చింది. అప్పటి నుంచి నాసా జెట్ ప్రొపల్సన్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు రోజూ రోవర్ నుంచి మెసేజ్ రాడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ విధంగా వారానికి మూడుసార్లు మెసేజ్ ఆపర్టూనిటికి పంపడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా ఇంతవరకు ఎలాంటి ‘బీప్’ తిరిగి రాలేదని శాస్త్రవేత్తల నుంచి సమాచారం వస్తోంది. నాసా ఆఖరిసారి ఆపర్టూనిటి నుంచి జూన్ 10న ‘బీప్’ వినగలిగింది. అప్పటి నుంచి యధాస్థితికి రాలేదని నాసా మార్స్‌కు చెందిన మార్స్ టెక్నాలజీ మీడియా వ్యవహారాల స్పెషలిస్టు ఆండ్రూగూడ్ చెప్పారు. అంగారక గ్రహంపై మబ్బులు విడి వాతావరణం యధా ప్రకారం ఏర్పడాలంటే సెప్టెంబర్ మధ్యలో కానీ సాధ్యం కాకపోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

రోవర్ ఉన్న ప్రదేశంలో వాతావరణంలో మార్పు వచ్చేంత వరకు ఆపర్టూనిటీ వ్యోమ నౌక నుంచి ఎలాంటి శబ్దం వినిపించదని శాస్రవేత్తల బృందం భావిస్తోంది. రోవర్‌లో ఆఖరి సంబంధాలు జూన్ 10 వరకు ఉన్న తరువాత నుంచి రోవర్ ఆపర్టూనిటీకి తక్కువ పవర్ అనుభవం ఎదురైంది. బహుశా అది మిషన్ క్లాక్ పొరపాటు కావచ్చని ‘నాసా’ పేర్కొంది. జూన్ 1న ప్రిజెవరెన్స్ లోయలో భారీ తుపాన్‌తో గాఢమైన చీకటి రాత్రి రోవర్‌కు చుట్టుముట్టింది. రోవర్ సాధారణంగా సౌరఫలకాల ద్వారా విద్యుత్‌ను పొంది తన బ్యాటరీలను రీఛార్జీ చేసుకుంటుంది. అయితే జూన్ 6వ తేదీ నాటికే ఆపర్టూనిటీ పవర్ స్థాయిలు బాగా దిగజారాయి. దాంతో కనీస నామామాత్ర ఆపరేషన్లకే రోవర్ పరిమితం కావలసి వచ్చింది. తరువాత తాత్కాలికంగా సైన్స్ ఆపరేషన్లు రద్దు అయ్యాయి. దుమ్ముతుపాన్ తీవ్రంగా చుట్టుముట్టినప్పటికీ ఆపర్టూనిటీ నాసా ఇంజినీర్లకు జూన్ 10న మెసేజ్ పంపగలగడం గమనార్హం.
-మన తెలంగాణ, సైన్స్ విభాగం

Comments

comments

Related Stories: