అంగారకుడిపై క్యూరియాసిటీ అడుగు పెట్టి ఆరేళ్లు

Robo

వాషింగ్టన్: అంగారక గ్రహంపై నాసా క్యూరియాసిటీ రోవర్ అడుగుపెట్టి నేటికి (ఆగస్టు 6వ తేదీకి) ఆరేళ్లు పూర్తయింది. నాసా క్యూరియాసిటీ రోవర్ ఒక పరిశోధకనౌక ద్రవరూపంలో నీటి ఆనవాళ్లను, జీవి మనుగడ సాగించే ఆధారాలను కనుగొనగలిగింది. మార్స్ సైన్స్ లేబొరేటరీ మిషన్స్ క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహం లోయలో ఆగస్టు 6న దిగింది. ఇదివరకు ఎన్నడూలేని అనేక సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. అంగారక గ్రహంపై ఇది వరకు కానీ ఇప్పుడు కానీ సూక్ష్మ జీవితం ఉందా లేదా అన్నది తెలుసుకోవడమే దీని లక్షం. ఒక కారు అంత సైజులో ఉండే రోవర్ 17 కెమెరాలు, రోబోటిక్ చెయ్యి, స్పెషల్ లేబోరెటరీ వంటి పరికరాలు, సాధనాలు కలిగి ఉంది.

ప్రస్తు తం అంగారక గ్రహంపై గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న తుఫాన్‌లో క్యూరియాసిటీ పరిశోధనలు సాగిస్తోంది. ప్రాచీన కాలం నాటి అంగారక గ్రహంపై సూక్ష్మరూప జీవులు జీవించ గలిగే రసాయన వాతావరణం ఉండేదని 2013లో క్యూరియాసిటీ కనుగొనగలిగింది. జీవించడానికి అవసరమైన ముఖ్యమైన సల్ఫర్, నైట్రోజన్, ఆక్సిజన్, పాస్ఫరస్, కార్బన్ మిశ్రమాల పౌడ రు నమూనాలను తవ్వితీయ గలిగంది. ఎల్లో గైప్ అగాధం నుంచి షిప్ బెడ్ అనే రాయిలోంచి ఈ డ్రిల్లింగ్ జరిగింది. మట్టి లవణాలు, ఉప్పు లవణాలు అంతగాలేని సమూనాలు కూడా బయటపడ్డాయి. దీనివల్ల ఒకప్పుడు తాగడానికి ఉపయోగపడే స్వచ్ఛమైన నీరు ప్రవహించేదని తెలిసింది.

ఆ తరువాత మృధువైన గుండ్రని శిలలు బయటపడ్డాయి. మోకాలి లోతున నిదానంగా వాగు ప్రవహించేదని తెలిపింది. 2014లో వాతావరణంలో మీథేన్ స్థాయిలను కనుగొనగలిగింది. రెండు నెలల కాలంలో పది రేట్లు మీథేన్ స్థాయి పెరిగిందని గ్రహించింది. ఈ ఫలితాలు మరింత ఆశను కలిగించాయి. జీవ కోటి మీథేన్ కూడా ఉత్పత్తి చేస్తుంది. లేదా శిలలకు నీటికి మధ్య రసాయనిక చర్యల వల్ల కూడా మీథేన్ ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు 2015లో సేంద్రియ అణువులు కనుగొనడమైంది. ఇవి జీవిత నిర్మాణ సముదాయాలు, శాంపిల్‌అనాలసిస్ ఎట మార్స్(ఎస్‌ఎఎం) సాధనం శిల నమూన పౌడరు నుంచి సేంద్రియ అణువులను కనుగొంది. ఒకానొక కాలంలో ముడి మిశ్రమాలు జీవితం ప్రారంభానికి అవసరమయ్యాయని ఈ పరిశోధనల వల్ల తేలింది.
మనతెలంగాణ, -సైన్స్ విభాగం

Comments

comments