అంగన్‌వాడీ కేంద్రాలను అన్ని వసతులతో తీర్చిదిద్దుతాం

ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రోస్ మన తెలంగాణ/మహబూబ్‌నగర్: జిల్లాలోని ఎర్రవల్లి తాండ, బోయపల్లి, వీరన్నపేటలోని అంగన్‌వాడీ కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రోస్‌లు కలిసి సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ నిధుల నుంచి ఎర్రవల్లి తండా, బోయపల్లి, వీరన్నపేట లోని  అంగన్‌వాడీ కేంద్రాలకు పునరుద్ధరణలో భాగంగా పెయింటింగ్, మరమ్మత్తులు, పిల్లలకు ఉపయోగపడే బొమ్మలు, గోడలకు వేయించి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు ఆహ్లాదకరంగా ఉండే విధంగా అండగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతామన్నారు. […]

ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రోస్

మన తెలంగాణ/మహబూబ్‌నగర్: జిల్లాలోని ఎర్రవల్లి తాండ, బోయపల్లి, వీరన్నపేటలోని అంగన్‌వాడీ కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రోస్‌లు కలిసి సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ నిధుల నుంచి ఎర్రవల్లి తండా, బోయపల్లి, వీరన్నపేట లోని  అంగన్‌వాడీ కేంద్రాలకు పునరుద్ధరణలో భాగంగా పెయింటింగ్, మరమ్మత్తులు, పిల్లలకు ఉపయోగపడే బొమ్మలు, గోడలకు వేయించి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు ఆహ్లాదకరంగా ఉండే విధంగా అండగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతామన్నారు. శిక్షాస్త్రీ అకాడమీ హైదరాబాద్ వారిచే టీచర్లకు ట్రైనింగ్ ఇప్పించడం, ఆంగ్లంలో బోధించుటకు టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అంగన్‌వాడీ పిల్లలతో  మాట్లాడుతూ  మీకు ఏమైనా సమస్యలు  ఉంటే మా దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమాధికారి శంకరాచారి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాధాఅమర్, శిక్షాస్త్రీ అకాడమీ, అంగన్‌వాడీ టీచర్లు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments