అంగన్‌వాడీల పారితోషికాలు పెంపు..

ఆరోగ్య బీమా వర్తింపు    ఆశా వర్కర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీ ప్రకటన న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు దీపావళి కానుకను ప్రకటించారు. అక్టోబర్ వారి నెలవారీ పారితోషికాన్ని పెంచుతున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఇదే కాకుండా గుర్తింపు పొందిన అందరు సామాజిక ఆరోగ్య కార్యకర్తలను( ఆశా వర్కర్లు) వివిధ సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకు రావడం జరుగుతుందని, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, […]

ఆరోగ్య బీమా వర్తింపు    ఆశా వర్కర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీ ప్రకటన

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు దీపావళి కానుకను ప్రకటించారు. అక్టోబర్ వారి నెలవారీ పారితోషికాన్ని పెంచుతున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఇదే కాకుండా గుర్తింపు పొందిన అందరు సామాజిక ఆరోగ్య కార్యకర్తలను( ఆశా వర్కర్లు) వివిధ సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకు రావడం జరుగుతుందని, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద వారికి ఉచిత బీమా కల్పించడం జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. బీమా కవరేజ్ కోసం ఈ కార్యకర్తలు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని, ఒక వేళ ఏదయినా అవాంఛనీయ ఘటన జరిగితే రూ.4 లక్షలు లభిస్తుందని మంగళవారం దేశవ్యాప్తంగా ఉన్న అశావర్కర్లు, ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ప్రధాని చెప్పారు. సవరించిన ప్రోత్సాహకం అక్టోబర్ నెలనుంచి అమలులోకి వస్తుందని, నవంబర్ నెలనుంచి వారి వేతనాల్లో ఆది కనిపిస్తుందని ఆయన చెప్తూ, ఇది వారికి దీపావళి కానుక అని అన్నారు. ఇప్పటివరకు నెలకు రూ.3 వేలు పారితోషికం పొందుతున్న వారికి రూ. 4,500లు, రూ.2,200 పొందే వారికి రూ.3,500లు లభిస్తుంది. అలాగే అంగన్‌వాడీ హెల్పర్ల పారితోషికాన్ని రూ.1500నుంచి రూ.2,500కు పెంచడం జరుగుతుందని ప్రధాని చెప్పారు.ఇది ఆశా వర్కర్లు, అంగన్‌వాడి కార్యకర్తలకు కేంద్రం మామూలుగా ఇచ్చే పారితోషికాలు కాగా, రాష్ట్రప్రభుత్వాలు వారికి విడిగా పారితోషికాలు ఇస్తాయి. బాలింతలు, నవజాత శిశువులకు పోషకాహార లోపం లేకుండా చూడడంతో పాటుగా, వారు పరిశుభ్ర వాతావరణంలో పెరిగేలా చేడడంలో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని మోడీ చెప్పారు. కామన్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ (ఐసిడిఎస్ సిఎఎస్) లాంటి టెక్నిక్‌లను ఉపయోగించే అంగన్‌వాడీ కార్యకర్తలకు అదనపు ప్రోత్సాహకాలు లభిస్తాయని, పనితీరును బట్టి ఈ ప్రోత్సాహకాలు రూ.250నుంచి రూ.500 వరకు ఉంటాయని కూడా ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఆరోగ్య బీమాపథకం ‘ఆయుష్మాన్ భారత్’ను సెప్టెంబర్ 23న జార్ఖండ్‌నుంచి ప్రారంభించడం జరుగుతుందని, లబ్ధిదారులను ఇప్పటికే గుర్తించడం జరిగిందని ప్రధాని చెప్పారు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన నవజాత శిశువు కరిష్మా ఈ పథకం కింద తొలి లబ్ధిదారుగా ఉంటుందని కూడా ఆయన చెప్పారు. కాగా దేశంలో రక్తహీనతకు సంబంధించిన వ్యాధులను తగ్గించడానికి కృషిని రెట్టింపు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రధాని నొక్కి చెప్పారు.

కోటి మంది బోగస్ లబ్ధిదారులు
ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో దాదాపు కోటి మంది బోగస్ లబ్ధిదారులు నమోదు అయినట్లుగా గుర్తించడం జరిగిందని, వారి పేర్లను జాబితాలనుంచి తొలగించడం జరిగిందని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మంగళవారం చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 14 లక్షల అంగన్‌వాడీలు ఉండగా పది కోట్ల మంది లబ్ధిదారులున్నారు. వీరిలో గర్భిణీలు, బాలింతలు కూడా ఉన్నారు. బోగస్ లబ్ధిదారుల గుర్తింపు, తొలగింపు అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అని, ఇప్పటివరకు కోటి మంది బోగస్ లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని మేనకా గాంధీ చెప్పారు. అసోంలో దాదాపు 14 లక్షల మంది బోగస్ లబ్ధిదారులను గుర్తించడంతో దేశవ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీల్లో ఉండే లబ్ధిదారులను వెరిఫై చేయాలని మంత్రి అన్ని రాష్ట్రాలను ఆదేశించారు.

Comments

comments

Related Stories: