అంగన్‌వాడీలను అక్కున చేర్చుకున్న కెసిఆర్

మన తెలంగాణ/మహబూబాబాద్ కల్చరల్:  అంగన్‌వాడీలకు పెద్దపీట వేసి జీతాలు పెంచి అక్కు న చేర్చుకున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వమని మహబూబాబాద్ ఎంపి సీతారాంనాయక్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ టిఎన్‌జిఒస్ అనుబంధంతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, అంగన్‌వాడీలను కూర్చోబెట్టి మాట్లాడిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుందని, అంగన్‌వాడీలకు కనీస వేతనం గురించి మీ […]

మన తెలంగాణ/మహబూబాబాద్ కల్చరల్:  అంగన్‌వాడీలకు పెద్దపీట వేసి జీతాలు పెంచి అక్కు న చేర్చుకున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వమని మహబూబాబాద్ ఎంపి సీతారాంనాయక్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ టిఎన్‌జిఒస్ అనుబంధంతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, అంగన్‌వాడీలను కూర్చోబెట్టి మాట్లాడిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుందని, అంగన్‌వాడీలకు కనీస వేతనం గురించి మీ డిమాండ్‌లు సరి అయినవని, మీ సమస్యలపై పార్లమెంటులో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని సీతారాంనాయక్ తెలిపారు. ఎంఎల్‌ఎ రెడ్యానాయక్ మాట్లాడుతూ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు సంఘటితమై ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమ జరుపుకుంటున్నందుకు అంగన్‌వాడీలను అభినందిస్తున్నానని డోర్నకల్ ఎంఎల్‌ఎ రెడ్యానాయక్ అన్నారు. మంచి ఆలోచనతో పేద పిల్లల సంక్షేమం కోసం అప్పటి మన మాజీ ప్రధాన మంత్రి పివి నర్సింహరావు ఈ వ్యవస్థను ప్రారంభించారని ఈరోజు గ్రామాలలో అంగన్‌వాడీల పాత్ర గణనీయంగా పెరిగిందని రెడ్యానాయక్ కొనియాడారు. తెలంగాణ రాకముందు టీచర్ల జీతాలు రూ.4500లు ఉండేవని తెలంగాణ వచ్చాక మన ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ఆడబిడ్డలు అని రూ.10,500 పెంచాడని ఇంకా పెంచడానికి ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు. ఒక అంగన్‌వాడీలకే కాదు, ఆశావర్కర్లు, విఎఒలు, ఇలాంటి వారందరికి గౌరవ ప్రధమైన వేతనం పెంచి వారి కుటుంబసభ్యులను ఆదుకున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వమని, అదేవిధంగా మీ డిమాండ్స్ కూడా ఆమోదయోగ్యమైనవని, మీ డిమాండ్స్‌తో ఏకీభవిస్తున్నట్లు రెడ్యానాయక్ తెలిపారు. మీ డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అమలు అయ్యే విధంగా కృషి చేస్తానని, మీ సంఘ బాధ్యులు ప్రతి నియోజకవర్గ శాసనసభ్యులకు వినతిపత్రం ఇస్తే అసెంబ్లీ ప్రస్తావించి డిమాండ్ల సమస్యను పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుదని ఆయన సూచించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.భిక్షమమ్మ మాట్లాడుతూ కేజి టు పిజిలో టీచర్లుగా తీసుకోవాలని, రిటైర్‌మెంట్స్ బెనిఫిట్స్, టీచర్‌కు రూ.60 వేల నుంచి రెండు లక్షల వరకు ఆయాలకు రూ.30 వేలు కాకుండా రూ.లక్ష ఇవ్వాలని, వారసత్వ ఉద్యోగాలకు అవకాశం ఇవ్వాలని, ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభసభ్యురాలు సత్యవతిరాథోడ్, శిశుసంక్షేమశాఖ ఆర్‌ఒ భారతీరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమాంజలి, కోశాధికారి పద్మ, సూపర్‌వైజర్ ఉషారాణి, ఎ.సుభాషిణి, ప్రధాన కార్యదర్శి వాణికుమారి, కోశాధికారి భారతి, టీచర్లు, వాణికుమారి, శ్రీలత, అరుణ, లక్ష్మిదేవి, భద్రకాళి, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: